ఏపీ ఈసెట్ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని తెలిపారు.అదేవిధంగా ఈ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి అని వెల్లడించారు.బాలికలు 95.68 శాతం, బాలురు 91.44 శాతం ఉత్తీర్ణత సాధించారు.పూర్తి ఫలితాలను cets.apsche.ap.gov.in వెబ్ సైట్లో ఉంచారు.ఏపీ ఈసెట్ స్కోరు కార్డును ఈ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.







