ఏపీ ఉద్యోగుల సంఘానికి హైకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు గుర్తింపు రద్దుపై ప్రభుత్వం అందించిన షోకాజ్ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది.
వేతనాల కోసం ఏపీ గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు రాష్ట్ర సర్కార్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం నిబంధనలు ప్రకారంగా ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వలేదని అభిప్రాయపడింది.
ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని తెలిపింది.ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.