ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్( AP DSC Notification ) విడుదల అయింది.ఈ మేరకు 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) విడుదల చేశారు.
ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215 మరియు ప్రిన్సిపల్స్ 42 పోస్టలును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.దీని ప్రకారం నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు.
ఈ నెల 22న దరఖాస్తులను స్వీకరించనున్నారు.
అలాగే వచ్చే నెల 5 నుంచి హాల్ టికెట్లు( Hall Tickets ) డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.మార్చి 15 నుంచి 30 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు.ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్ ఉండనుంది.కాగా 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.