వైరల్ : ఏపీ డిప్యూటీ సీఎం టిక్ టాక్

ఏదో ఒక విషయంతో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఆమె ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో ఒకరిగా కలిసిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఉత్తరాంధ్ర జిల్లాలోని విజయనగరం జిల్లాకు చెందిన ఈమె విశాఖను రాజధానిగా జగన్ ప్రకటించడంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు.గతంలో ఆమె విశాఖలోని మరికావలలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సైన్సు ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆమె ఎగ్జిబిషన్ కు ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా డాన్స్ చేశారు.

విద్యార్థులు ముందుగా డ్యాన్స్ చేస్తుండగా ఆమె కూడా విద్యార్థుల్ని ఉత్సాహపరిచేందుకు వారితో కలిసి సరదాగా డ్యాన్స్ వేసిన వీడియో అప్పుడు వైరల్ అయ్యింది.దీంతో అప్పట్లో ఆమె పేరు మారుమోగింది.

తాజాగా ఆమె చేసిన టిక్‌టాక్ వీడియో కూడా అదే రేంజ్ లో వైరల్‌గా మారిపోయింది.సీఎం జగన్‌ను పొడుగుతూ టిక్‌టాక్‌లో ఇప్పటికే హల్ చల్ చేస్తున్న ఓ సాంగ్‌ను అనుకరించిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అంటూ సాగే పాటకు ఆమె అనుకరిస్తూ చేసిన టిక్‌టాక్ వీడియో బాగా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆమె వీడియో ను నెట్ జెన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు