పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది.ఏపీ ప్రతి ఏటా సుమారు రూ.45 వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2019తో పోలిస్తే ప్రస్తుతం అప్పులు రెండింతలు పెరిగాయి.సుమారు రూ.లక్ష కోట్ల అప్పులు పెరిగినట్లు రాజ్యసభకు కేంద్ర ఆర్థికశాఖ వివరించింది.బడ్జెట్ లెక్కల ప్రకారం ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉందని తెలిపింది.2019లో రూ.2,64,451 కోట్ల అప్పు ఉందని పేర్కొంది.రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.