కార్పొరేట్ విద్యాసంస్థల కి మొదటి దెబ్బ కొట్టిన జగన్

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో లో విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేట్ విద్యాసంస్థలు కబ్జా చేసేసాయి అని చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా ప్రమాణాలను పూర్తిగా తుంగలో తొక్కేసి మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థుల మీద చదువుని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ వారిలో మానసిక ఒత్తిడి పెరగడం కి కారణం అవుతున్నాయి.

కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల పడిపోతున్న విద్యా ప్రమాణాల గురించి చాలామంది విద్యా వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ఈ విద్యా సంస్థలు నడుపుతున్న యాజమాన్యాలు రాజకీయ పార్టీలకి ఫండ్స్ ఇవ్వడం అలాగే ప్రత్యక్షంగా పార్టీలతో క్రియాశీలకంగా పని చేయడం వలన అధికారంలోకి వచ్చిన పార్టీలు విద్యా సంస్థల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఆ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.మరోవైపు కార్పొరేట్ విద్యాసంస్థల ను పెంచి పోషించే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యం కూడా నాశనం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.

Advertisement

తాజాగా విజయవాడలోని సత్యనారాయణ పురంలో అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థల బ్రాంచ్ లకి విద్యాశాఖ లక్ష రూపాయల జరిమానా విధించి సీజ్ చేశారు.కార్పొరేట్ విద్యాసంస్థల పై వైయస్ జగన్ తీసుకున్న యాక్షన్ ప్లాన్ లో ఇది మొదటి ఎత్తు అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

తాజా వార్తలు