ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార వైసీపీ ఇప్పటినుంచే గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా రాష్ట్రంలోని టీడీపీ స్థానాలపై వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే ఇవాళ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ స్థానంలో టీడీపీనే విజయం సాధించింది.







