అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలో( Siddam Sabha ) సీఎం జగన్( AP CM Jagan ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) ఆయన సవాల్ విసిరారు.
చంద్రబాబు పేరు చెబితే రైతన్నలకు గుర్తుకు వచ్చే ఒక్క పథకం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.చంద్రబాబు పేరు చెబితే మహిళలకు గుర్తుకొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అన్న సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే విద్యార్థులకు గుర్తుకొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు.
చంద్రబాబు పేరు చెబితే అవ్వ తాతలకు గుర్తుకొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.అదేవిధంగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చంద్రబాబు మార్క్ ఒక్కటైనా ఉందా అని అడిగారు.
ఎన్నికలప్పుడు చంద్రబాబు రంగురంగుల మ్యానిఫెస్టోను రాస్తారని విమర్శించారు.
1995, 1999, 2014 లో సీఎంగా చంద్రబాబు మ్యానిఫెస్టోను( Manifesto ) పది శాతమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకని చంద్రబాబు అనుకుంటారన్న సీఎం జగన్ మూడు సార్లు సీఎంగా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.అందుకే అన్ని వర్గాలు చొక్కా మడతపెట్టి.
చంద్రబాబు కుర్చీని మడతపెట్టారని తెలిపారు.టీడీపీకీ( TDP ) 102 నుంచి 23 స్థానాలను తగ్గించారన్నారు.
అలాగే పథకాలన్నీ ఇకపై కొనసాగాలంటే మన పాలన అవసరమని ప్రజలకు తెలియజేయాలని వెల్లడించారు.పథకాలను అందుకున్న ప్రతి కుటుంబం స్టార్ క్యాంపెయినర్ కావాలని కోరారు.