తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ప్రతిష్టను బజార్ గింజల పరస్పర విమర్శలు చేసుకుంటూ ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు అధినేత జగన్ గట్టిగా మందలించినట్టు సమాచారం.పార్టీ ప్రతిష్ఠను పక్కనపెట్టి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైసీపీ నేతల పంచాయతీ పార్టీ గోదావరి జిల్లాల ఇన్చార్జి వై.
వి.సుబరెడ్డి సమక్షంలో ముగిసింది.ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడిని పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు.అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా పర్యవేక్షకుడు వై.వి.సుబ్బారెడ్డి రెండు విడతలుగా వీరిరువురుతో భేటీ అయ్యారు.ఇద్దరూ విడివిడిగా మాట్లాడి సుబ్బారెడ్డి వివరణ తీసుకున్నారు.సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ఈ పంచాయతీ కొనసాగింది.కాగా జరిగిన భేటీపై బుధవారం మీడియాతో మాట్లాడుతానని ఎంపీ భరత్ తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.
కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్ద ఎత్తున వసూళ్లు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇటీవలే పరోక్ష విమర్శలు గుప్పించారు.

దీనిపై ఎంపీ భరత్ మాట్లాడుతూ చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని తనపై అభియోగాలను చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు.ఇలా ఒకరిపై ఒకరు అవ భూముల వ్యవహారం… పార్టీ వ్యవహారాలపై విమర్శలు గుప్పించుకున్నారు.దీంతో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి వెళ్లడంతో… దృష్టిపెట్టిన వైవీ సుబ్బారెడ్డి చివరికి ఇద్దరితో చర్చలు జరిపి అధినేత చేత సున్నితంగా మందలించేలా చేసినట్లు వినికిడి.