చంద్రబాబు, పవన్‌కు సీఎం జగన్ వార్నింగ్.. తగ్గేదే లే..!!

ఏపీలో రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి.ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నా ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

 Ap Cm Jagan Warning To Chandrababu And Pawan Kalyan Andhra Pradesh , Jagan, Chan-TeluguStop.com

ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే మిగతా అన్ని పార్టీలలోనూ ఎన్నికల కోలాహలం నెలకొంది.సంక్షేమ పథకాల పేరుతో వైసీసీ వరుసగా బహిరంగసభలు ఏర్పాటు చేయడంతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వరుసగా పర్యటనలు చేస్తున్నారు.ఇటీవల ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో పర్యటించిన ఆయన.సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

బీజేపీ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు దూసుకువెళ్తోంది.

అయితే సీఎం జగన్ మాత్రం ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు.

అంతేకాకుండా వ్యతిరేక మీడియాపైనా విరుచుకుపడుతున్నారు.ఆయనకు అందరూ అనుకూలంగా పనిచేయాలని జగన్ భావిస్తున్నారు.

జనాల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు.చంద్రబాబు హయాంలో పథకాలను, తన హయాంలో పథకాలను ప్రజలు కంపేర్ చేసుకోవాలని ప్రతి బహిరంగ సభలో వ్యాఖ్యానిస్తున్నారు.

దుష్ట చతుష్టయం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియాను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan-Telugu Politic

చంద్రబాబు హయాంలో అనేక వర్గాలు ఇబ్బందులు పడితే ప్రజా సమస్యలపై ఎల్లో మీడియా ఎందుకు రాయలేదని.ఇపుడు తన పాలనపై ఎందుకు రంధ్రాన్వేషణ చేస్తున్నారని జగన్ ప్రశ్నిస్తున్నారు.పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ సంభోదిస్తూ ఆయన్ను రెచ్చగొడుతున్నారు.

రైతులకు రుణమాఫీని చంద్రబాబు అమలు చేయకపోతే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు.ఇలా ఏ సభకు వెళ్లినా జగన్ ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి కాకుండా ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యం ఇస్తూ తగ్గేదేలే అని హెచ్చరికలు పంపిస్తున్నారు.

మరోవైపు రాజకీయాలు చేయను అంటూనే… పలు కేసుల పేరిట టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube