ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి తట్టుకోలేక లేని పోని విమర్శలు చేస్తున్నారు.
ఏదైనా మంచి పని మొదలు పెడదామంటే చాలు విమర్శలతో సిద్దంగా ఉంటున్నారు.రాష్ట్రం బాగుపడుతుంటే ఓర్వలేక పోతున్నారు అంటూ జగన్ అన్నాడు.
చంద్రబాబు నాయుడు మరియు ఆయన పార్టీ నాయకులకు విమర్శించడం తప్ప మరే పని పాట లేనట్లుగా ఉందని, మంచి చెడు చూడకుండా అన్నింటికి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో వ్యవసాయ శాఖ సమీక్షను నిర్వహించిన సీఎం జగన్ పలు విషయాల గురించి చర్చించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి అందుతున్న సహాయ పథకాల విషయంపై సంబంధిత అధికారులు మరియు మంత్రితో జగన్ చర్చించారు.ఈ సందర్బంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గ్రామసచ్చివాలయాలతో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ అవ్వడంతో పాటు ఆఫీసుల చుట్టు తిరగక్కర్లేదు.కాని వారిని కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శించే స్థాయికి దిగజారారు అంటూ వ్యాఖ్యలు చేశారు.