కేంద్రంతో కయ్యానికి సై అంటున్న బాబోరు

ఏపీ సీఎం ఇక కేంద్రంలో తాడో పేడో తెల్చుకోనున్నారా.? కేంద్రంతో “ఢీ అంటే ఢీ” కొట్టడానికి సిద్దంగా ఉన్నారా అంటే నిజమే అంటున్నాయి ప్రస్తుతం బాబు చేసే కామెంట్స్.

బాబు యవ్వారం చూస్తుంటే.

పంతం నీదా నాదా సై అంటూ రంగం లోకి దూకే ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు అని తెలుస్తోంది.అయితే బాబు నోటి వెంట ఈ మాటలు వచ్చాయి అంటేనే ఎదో భారీ ప్లాన్ వేశారు అని ఫిక్స్ అవ్వచ్చు.

అసలు బాబు ఏమన్నారు.ఏంటి అనే విషయాలలోకి వెళ్తే.

గుంటూరు జిల్లా ఉడవల్లి లో సీఎం నివాసం వద్ద జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో కేంద్రపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు బాబు.ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికమేరకు మీరు విభజన జరగలేదు మాకు మాత్రం అన్యాయం జరిగింది.

Advertisement

విభజన హామీలు ఇప్పటి వరకూ నెరవేర్చలేదు అంటూ చంద్రబాబు చాన్నాళ్ళ తరువాత తన మనసులో ఉన్న భాదని వ్యక్తం చేశారు.విభజనతో ఏపీకి అన్యాయం జరిగింది కేంద్రం మాత్రం బెల్లం కొట్టిన రాయిలా అలానే కూర్చొంది ఇలా ఉంటే ఏపీ పరిస్థితి ఏమి కావాలి అంటూ ఫైర్ అయ్యారు బాబు.

ఏపీని గాలికి వదిలేస్తే నేను చూస్తూ ఊరుకోనని ఎంతవరకైనా వెళ్తా అని హెచ్చరించారు.ఇదే ఈ విషయంపై మొన్న ప్రధానిని కలిసినప్పుడు కూడా గట్టిగా చెప్పాను అని మాకు విభజన చట్టంలో ఇచ్చిన హక్కుల ప్రకారమే అడుగుతున్నాం తప్ప కొత్తగా మేము ఏమి అడగడం లేదని తెలిపారు.

విభజన వాళ్ళ ఏపీ తలసరి ఆదాయం తగ్గిందని.ఓ పక్క కేంద్రం నుంచీ వచ్చే నిధులు కూడా ఏ మాత్రం సరిపోవడం లేదని తెలిపారు.

చట్టబద్దంగా మాకు వచ్చే ప్రయోజనాలు మాకు ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం అని అన్నారు చంద్రబాబు.ఈ విషయంలో కోర్టులకి వెళ్ళడానికి కూడా నేను సిద్దంగా ఉన్నాను.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

సుప్రీంకోర్టు కోర్టులో మాకు పూర్తి న్యాయం జరుగుతుంది అని తెలిపారు.అయితే బాబు ఒక్కసారిగా తన మాటల్లో హీట్ పెంచడంతో బేజేపి నేతలు ఖంగుతిన్నారు.

Advertisement

మరి బాబు కామెంట్స్ పై బిజెపి ఎలాంటి కౌంటర్ ఇస్తుందే వేచి చూడాలి.

తాజా వార్తలు