ఇక మీరే దిక్కు.. వాళ్ళను మొక్కుతున్న బాబు

ఏపీలో టీడీపీకి తిరుగులేదు.రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయం ! సర్వేలు కూడా అవే చెప్తున్నాయి.

 Ap Cm Chandrababu Naidu Conference Meets For Collectors-TeluguStop.com

ప్రజలు టీడీపీ పాలన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు.అంటూ ధీమాగా లెక్కలు చెప్పుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు వట్టి గాలి మాటలే అని అర్ధం అవుతోంది.

వాస్తవం లోకి వెళ్లి చూస్తే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇది ఎవరో అన్న మాటలు కాదు సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటున్న నిజం.

జిల్లాల కలెక్టర్లు, కీలక శాఖల ఐఏఎస్‌లతో గురువారం చంద్రబాబు ముఖాముఖీ సమావేశం నిర్వహించారు.ఈ భేటీలో చంద్రబాబు అనేక సంచలన విషయాలు బయటపెట్టారు.క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందని సీఎం కామెంట్స్ చేశారు.ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్న నేపథ్యంలో దాన్ని ఎలా అధిగమించాలో సలహాలు ఇవ్వండి అని ఐఏఎస్‌లను ముఖ్యమంత్రి కోరారు.

వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు సహకరించాలని కలెక్టర్లు, ఐఏఎస్‌లను వేడుకున్నారు.

ఈ ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమని అందుకే క్షేత్రస్థాయిలో టీడీపీ సానుభూతిపరులైన ఉద్యోగులకే కీలక బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు.నిజాయితీగా, ముక్కుసూటిగా పనిచేసే వారిని ఎన్నికల ఏడాది పక్కన పెట్టాలని సూచించారు.అంతేకాకుండా జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపైనా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను కోరారు.

టీడీపీకి సహకరించే అధికారులను గుర్తుపెట్టుకుంటామని వారికి బిస్కెట్లు వేశారు.చంద్రబాబు ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడలేదని , అధికారులను పరుగులు పెట్టించి ఉక్కిరిబిక్కిరి చేయించి మరీ ఆయన పని చేయించుకుంటాడు తప్ప ఇలా వేడుకోవడం కొత్తగా ఉందని ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు గుసగుసలాడుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube