ఉదయ్ కిరణ్…అతి కొద్దీ కాలం లోనే వరుస హిట్లు అందుకొని ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న హీరో.చిరంజీవి అల్లుడయ్యే అవకాశం కోల్పోవడం, సినిమా అవకాశాలు ఒక్కసారిగా తగ్గడంతో డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యి చివరికి సూసైడ్ చేసుకున్నారు.
ఇది ఇలా ఉండగా …ప్లాపులు ఎదురవుతున్న టైం లో ఒకరోజు ఫ్రెండ్ ఇచ్చిన పార్టీ కి వెళ్ళిన ఉదయ్ కిరణ్ కు విశిత తారసపడింది.అదే పార్టీ లో వారిద్దరి మధ్యా మాటలు కలిశాయి.
పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.
పెళ్లి తరువాత కూడా విశిత తన సాఫ్ట్ వేర్ జాబ్ ని కూడా కంటిన్యూ చేసింది.ఆమెకు ఉదయ్ కిరణ్ అంటే ఎంతో ప్రేమ.అందుకే ఉదయ్ కిరణ్ కు అవకాశాలు తగ్గిపోయాక కూడా వారిద్దరి మధ్యా మనస్పర్ధలు రాలేదు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే డిప్రెషన్ లో ఉన్న ఉదయ్ కిరణ్ ను విశిత యోగ, వెల్ నెస్ సెంటర్ లకు తీసుకెళ్లి ఆయన్ను తిరిగి మామూలు మనిషిని చేయాలని తలచింది.మంచి డాక్టర్ల దగ్గర వద్దకు కూడా తీసుకెళ్లి ఆయన్ను తిరిగి మామూలు మనిషిగా నిలబెట్టాలని శతథా ప్రయత్నించింది.
కొన్ని రోజుల తరువాత మాములుగా మారిన ఉదయ్ కిరణ్ విశిత లేని టైం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది.
అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తరువాత విశిత ఏం చేస్తుందో చాలా మందికి తెలియదు.దీని ఫై చాలా మంది తమకు ఇష్టం వచ్చినట్లుగా ఊహించుకున్నారు.
ఆమె పని చేస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో సహ ఉద్యోగులు చెపుతున్న ప్రకారం ఆమె ఇంకా ఉదయ్ కిరణ్ ను మర్చిపోలేదు.ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదిస్తున్న విశిత తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని అనాధ పిల్లల కోసం ఖర్చు పెడతోంది.
తనకు శని, ఆదివారాలు సెలవు కావడంతో ఆమె ఆ రోజుల్లో అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో గడుపుతూ వారికి సేవ చేయడంలో సంతృప్తి పడుతూ తన జీవితానికి జరిగిన గాయాన్ని మాన్పుకునే ప్రయత్నంలో ఉంది.
ఉదయ్ కిరణ్ ఎంతసేపూ తాను స్టార్ హీరోనన్న చట్రంలో బిగుసుకుపోయాడని, దాన్నుంచి బయటకు రాలేక తరచూ మదనపడుతుండేవాడని, ఎన్నిసార్లు ఆయనకు నచ్చజెప్పినా లాభం లేకపోయిందని విషిత ఆవేదన వ్యక్తం చేసింది.గతం లో… సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, సహచర నటులు మాట్లాడకపోవడం, సినీ కార్యక్రమాలకు పిలవకపోవడం, వందేళ్ల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడం, ఇవన్నీ ఉదయ్ కిరణ్ పై ప్రభావం చూపాయని ఆమె చెప్పారు.విలువైన స్థలాలు చాలానే వున్నా వాటిని అమ్మి పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడని చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారని గ్రహించిన ఉదయ్ కిరణ్… విశితతో చెన్నయ్‌కి వెళ్దామని, అక్కడ సినిమా అవకాశాల్లో ప్రయత్నిద్దామని చెప్పేవాడట.దాంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నామని ఆమె చెబుతూ ఉంటుందంటున్నారు కొలీగ్స్.నెలకు రూ.25 వేల అద్దెతో ఓ ఇంటిని తీసుకుని 3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించామని, కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విషిత చెప్పుకొచ్చింది…మొత్తానికి రెండో పెళ్లి చేసుకోకుండా అతని జ్ఞాపకాల తోనే కాలం గడుపుతోంది ఆమె… గ్రేట్ కదా…
.