ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ .. ఏ ఏ అంశాలపై చర్చించారంటే ? 

భారత ప్రధాని నరేంద్ర మోదితో ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఈరోజు భేటీ అయ్యారు.

రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల పైన చంద్రబాబు చర్చించారు .

ముఖ్యంగా విభజన హామీల అమలుతో పాటు, పోలవరం నిర్మాణం , మౌలిక వసతుల కల్పన , ప్రాజెక్టుల మంజూరు పైన ప్రధానంగా చర్చించారు.  అలాగే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు,  పారిశ్రామిక రంగాలకు రాయితీ,  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం  తదితర అంశాల పైన ప్రధాని కి చంద్రబాబు విజ్ఞప్తులు చేశారు.

  దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో చంద్రబాబు కోరిన డిమాండ్లపై ప్రధాని మోదీ( PM Modi ) సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఇక అంతకుముందే కేంద్రమంత్రి పియూస్ గోయల్ తో( Piyush Goyal ) బాబు భేటీ అయ్యారు.ఇక ఈరోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రులు నితిన్ ఘట్కరి , శివరాజ్ సింగ్ చౌహన్ తో సమావేశం కానున్నారు.  సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్ హర్దీప్ సింగ్ పూరితోను భేటీ అవుతారు.

Advertisement

చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు,  పెమ్మసాని చంద్రశేఖర్,  భూపతి రాజు శ్రీనివాస్ వర్మ , రాష్ట్రానికి చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్,  బీసీ జనార్దన్ రెడ్డి , నీరబ్ కు,  ప్రభుత్వ అధికారులు ఉన్నారు.

రేపు ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం , ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,( Nirmala Sitaraman )  ఉదయం 10:45 గంటలకు ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా,( JP Nadda )  మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్రమంత్రి హతావాలే తో చంద్రబాబు భేటీ అవుతారు.  ఆ తరువాత పలువురు పారిశ్రామికవేత్తలతోను,  జపాన్ రాయబారితోను చంద్రబాబు భేటీ అవుతారు.  సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చంద్రబాబు చేరుకుంటారు.

చంద్రబాబు పర్యటనతో ఏపీకి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంటుందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు.

రఘురామ ఫిర్యాదు .. జగన్ పై కేసు నమోదు 
Advertisement

తాజా వార్తలు