ఏపీలోని టీడీపీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది.ఈ మేరకు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబును కలిసిన సీఐడీ కానిస్టేబుల్ నోటీసులు అందజేశారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసు నేపథ్యంలో పార్టీ అకౌంట్ లోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని నోటీసులు ఇచ్చారని సమాచారం.
ఈ క్రమంలో ఈనెల 18వ తేదీన నగదుకు సంబంధించిన వివరాలతో సీఐడీ కార్యాలయానికి టీడీపీ కార్యాలయ ప్రతినిధిని పంపాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.అయితే ఏపీ సీఐడీ వేధింపులకు గురి చేస్తుందంటూ టీడీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.







