ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు.ఈ క్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్ కు సీఐడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో భాగంగా నారా లోకేశ్ కు నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం.
హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వనుండగా అటు విచారణకు సహకరించాలని లేకేశ్ కు హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.కాగా ఇదే కేసులో ఏ14గా ఉన్న లోకేశ్ కు అక్టోబర్ 3వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
ఈ క్రమంలో సీఐడీ పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు.







