వైరల్: చటుక్కున వచ్చి ఒక్కట్టిచ్చి పుటుక్కున లాక్కెళ్లింది?

ఇదేదో సామెత అని అనుకొనేవారు కాబోలు.అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.

 The Kitten Was Lost From The Mother Cat Video Goes Viral Details, Viral Latest,-TeluguStop.com

విషయంలోకి సూటిగా వెళితే, ఈ భూమిపై అమ్మ ( Mother ) ఎవరికైనా అమ్మే.అది మనిషికైనా జంతువుకైనా.

బిడ్డ క్షణం కనిపించకపోతే ఏ తల్లి మనసైనా అల్లాడిపోతోంది.ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కన్నబిడ్డ కంటికి కనిపించేదాకా వెతికి వెతికి వేసారిపోతుంది.

అమ్మకు తీరా బిడ్డ కనిపించగానే ఏమై పోయావురా? ఇంకొంచెం ఉంటే గుండె ఆగిపోయేది అంటూ గుండు మీద ఒక్కటిస్తుంది… ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ కదా.

ఈ అనుభవం ప్రతీ ఒక్కరికీ తమ జీవితంలో ఎదురవుతుంది.అచ్చం ఇలాంటి ఘటన ఓ పిల్లికి ( Cat ) ఎదురయ్యింది అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే ఇక్కడ దృశ్యాలను మీరు తప్పకుండా చూడాల్సిందే.అవును, సరిగా ఇలాగే చేసింది ఒక తల్లి పిల్లి.

( Mother Cat ) దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ కాగా దానిని చూసిన నెటిజనం చాలా ఎంజాయ్ చేస్తున్నారు.అంతేకాకుండా ఆ తల్లి పిల్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో వున్న విషయానికొస్తే, ఒకపిల్లి తన పిల్లికూనను( Kitten ) వెతుక్కుంటూ వెతుక్కుంటూ సందుగొందుల్లో తిరుగుతూ ఉంటుంది.ఇంతలో ఒకచోట ఆ బుజ్జి కూన కనిపిస్తుంది ఆ తల్లి పిల్లికి.వెంటనే ఆ తల్లి పిల్ల మరోమారు ఆలోచించకుండా చటుక్కున ఆ పిల్లి పిల్లకి ఒక్కటిచ్చి… నోటితో కరుచుకుపోయింది.కాగా ఈ దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.దీన్ని ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద( Chinmayi Sripada ) తోపాటు వేల కొంతమంది రీట్వీట్‌ చేయగా ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది.ఇక ఆ దృశ్యం చూడడానికి ఎంత క్యూట్ గా వుందంటే అది మాటల్లోని చెప్పలేని ఓ అందమైన అనుభవం అనుకోక తప్పదు.

కావాలంటే మీరు కూడా ఆ అందమైన దృశ్యాన్ని చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube