డైరెక్టర్ కు బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చిన బేబీ ప్రొడ్యూసర్.. ఫోటో వైరల్!

ఈ మధ్యకాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయితే దర్శకులకు, హీరోలకు సంగీత దర్శకులకు నిర్మాతలు ఖరీదైన కానుకలు ఇవ్వడం మనం చూస్తున్నాము.ఇలా ఒక సినిమా ద్వారా నిర్మాతలు భారీగా లాభాలను అందుకుంటే వారికి ఖరీదైన కానుకలను అందిస్తూ ఉంటారు.

 Baby Producer Skn Gifted Car To Director Sai Rajesh ,sai Rajesh, Skn, Vaishnavi-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది హీరోలు దర్శకులు ఖరీదైన కార్లను బహుమానంగా పొందారు.తాజాగా బేబీ( Baby ) డైరెక్టర్ సాయి రాజేష్కూడా నిర్మాత నుంచి ఖరీదైన కారును బహుమానంగా పొందారు.

సాయి రాజేష్ దర్శకత్వంలో విరాజ్ అశ్విన్( Viraj Aswini ) ,ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బేబీ.

Telugu Baby, Sai Rajesh, Tollywood-Movie

ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన మైనటువంటి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ భారీగా లాభాలను పొందారు.పది కోట్ల రూపాయలతో తెరకేక్కించిన ఈ సినిమా ఏకంగా 90 కోట్ల కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది.ప్రముఖ ఓటీటీ ఆహాలోకి వచ్చిన 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి రికార్డ్స్ సృష్టించింది.

Telugu Baby, Sai Rajesh, Tollywood-Movie

ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో నిర్మాత డైరెక్టర్ సాయి రాజేష్ కి( Sai Rajesh ) ఖరీదైన కారును కానుకగా అందించారు.తాజాగా ఈయన బెంజ్ కారును దర్శకుడికి కానుకగా అందించారు.ఇకపోతే ఈయనకు నిర్మాత కారును బహుమానంగా ఇవ్వడం ఇది రెండోసారి ఈ సినిమా విడుదలకు ముందే సినిమా రషెస్ చూసిన కాన్ఫిడెన్స్ తో డైరెక్టర్ సాయి రాజేష్ కు ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చారు.అయితే ఈ సినిమా కోట్లలో లాభాలను అందించడంతో మరోసారి ఈయనకు కారును కానుకగా అందించడం గమనార్హం.

ఇక సాయి రాజేష్ తన తదుపరి చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మాణంలోని చేయబోతున్నారని సమాచారం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube