ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం వాడి వేడిగా ఉంది.ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే ఎవరికి వారు తమ ప్రత్యర్థులపై మాటల తూటలు పేల్చుతున్నారు.
ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత లోకేష్ పాదయాత్ర కూడా సంచలనం రేపుతుంది.మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి”తో రాష్ట్ర మొత్తం పర్యటించడానికి రెడీ అవుతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఈనెల 14వ తారీకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.ఇంకా అదే రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి.
ఈ క్రమంలో మంత్రివర్గం రాష్ట్ర బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది.వైసీపీ ప్రభుత్వం చివరిగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇది.ఎందుకంటే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.దీంతో చివరి బడ్జెట్ లో మరింతగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ వైసీపీ వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు సంక్షేమ పాలన దిశగానే ఎక్కువ నిర్ణయాలు తీసుకున్నారు.సో చివరి బడ్జెట్.పైగా వచ్చే ఏడాది ఎన్నికలు నేపథ్యంలో.ప్రజలను ఆకర్షించే రీతిలో.
పలు పథకాలకు భారీ ఎత్తున కేటాయింపులు ఉండే అవకాశం ఉందని సమాచారం.







