అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఏపీ కేబినెట్ ఆమోదం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కొద్ది గంటల క్రితం ముగిసింది.ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 Ap Cabinet Approves Ambedkar Konaseema District Details, Ap Cabinet, Ambedkar K-TeluguStop.com

దాదాపు నలభై రెండు అంశాలపై చర్చ జరిగింది.వీటిలో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్న సమయంలో ఆ ప్రాంతాల్లో పలు కథనాలు చోటు చేసుకోవడం తెలిసిందే.పెద్ద ఎత్తున నిరసనలు మరియు ఆందోళనలు చేయటం మాత్రమే కాదు ఏకంగా మంత్రి ఇంటి పై దాడి ఇంకా పలువురు ప్రజాప్రతినిధుల ఎల్లపై కూడా దాడులు చేయడం జరిగింది.

ఈ దాడులకు సంబంధించి దాదాపు వంద మందిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా క్యాబినెట్ ఆమోదం తెలపడం రాజకీయంగా సంచలనం రేపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube