ఎపి బిజెపి ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం

విజయవాడ: ఎపి బిజెపి ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం.బిజెపి సోషల్ మీడియా, ఐటి ప్రతినిధులు కు రాష్ట్ర స్థాయి వర్కుషాపు.

 Ap Bjp Sankhanadam Program In Vijayawada, Ap Bjp, Sankhanadam Program ,vijayawad-TeluguStop.com

శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన పునీత్ జీ.బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. సోషల్ మీడియా లో కేంద్రం ఎపికి చేసిన సాయం పై విస్తృతమైన ప్రచారం.రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను మా ప్రతినిధులు సోషల్ మీడియా మాథ్యమం ద్వారా వివరిస్తారు.

ఎన్నికల సమయానికి అందరూ సన్నధ్దం కావాలి.నేడు సోషల్ మీడియా ఎంతో కీలకంగా పనిచేస్తుంది.

సమాజంలో సోషల్ మీడియా అంశాల పైనే చర్చ సాగుతుంది.సోషల్ మీడియా లో ఎలా పని‌చేయాలో నేడు శిక్షణ ఇస్తాం.

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక కేంద్రం అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది.ఎన్నికల సమర శంఖం పూరించేలా… శంఖానాదం అని పేరు పెట్టాం.

మహిళల కోసం మోడీ ఒక అన్న గా అండగా నిలిచారు.మహిళల గౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు.

నాడు కొంతమంది అవహేళనగా మాట్లాడారు.మహిళల పేరుతో ఇళ్ల నిర్మాణం చేశారు.

మహిళల పై జరుగుతున్న దురాగతాలను నివారించే చర్యలు చేపట్టారు.మహిళల కు ప్రాధాన్యత ఇస్తూ మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారు.ఉజ్జ్వల పధకం ద్వారా గ్యాస్ బండలను అంద చేశారు.రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు కోసం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారు.

గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపు పై మేము పోరాటం చేశాం.మా‌ మిత్ర పక్షం జనసేన తో కలిసి ఆందోళనలు నిర్వహించాం.

అన్ని అంశాలను గవర్నర్ కి, కేంద్రం లో పెద్దలకు ఫిర్యాదు చేశాం.టిటిడి వంటి హిందూ బోర్డులో అన్యమతస్తులను నియమించారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తిన్న వైనాన్ని వివరించాం.దీని‌పై మా పార్టీ తరఫున సంతకాలు సేకరణ చేపట్టాం.

నా భూమి, నాదేశం‌ కార్యక్రమం బిజెపి జాతీయ స్థాయిలో చేపట్టింది.సెప్టెంబరు ఒకటి నుంచి 15 వరకు అన్ని గ్రామాల్లో మట్టిని సేకరిస్తాం.

పట్టణాలు, నగరాల్లో బియ్యం సేకరిస్తాం.

రెండో దశ లో గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు చేపడతాం.

ఈ మట్టి ని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృత వనం ఏర్పాటు చేస్తాం.ఈ మట్టి ఎలా పంపాలో రెండో దశలో ప్రజలకు వివరిస్తాం.

రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతినిధులు సోషల్ మీడియా లో పని చేసేలా అవగాహన కల్పిస్తాం.పేదల కోసం రెండు వందలు గ్యాస్ తగ్గిస్తే రాజకీయం అనడం తగదు.

గ్యాస్ ధర తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నారా వాళ్లు చెప్పాలా.యన్టీఆర్‌ నాణెం ఆవిష్కరణ లో మా కుటుంబం అంతా పాల్గొంది.

మా తరువాత వారసులు కూడా తాత పై ప్రేమతో పాల్గొన్నారు.రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమం పై సజ్జల చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.

రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి రాజకీయం చేయడం తగదు.సజ్జల, విజయసాయి రెడ్డి ల వ్యాఖ్యలు పై నేను స్పందించను.

ఎనిమిది మాసాల్లో ఎన్నికలు ఉన్నాయి అప్పటి కి పార్టీ ని సన్నద్ధం చేస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube