ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష పార్టీ అర్హతకు నోచుకోని బిజెపి తర్వాత రాబోయే రోజుల్లో ఇక్కడ ఎలా ఎదగాలి అనే అంశం పైన దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఒకపక్క తెలంగాణలో బిజెపి బండి సంజయ్ నాయకత్వంలో దూసుకెళ్లిపోతోంది.
ఒక రకంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బిజెపి అనే చెప్పాలి.పైగా ఏకంగా టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ అంటూ ఒక కొత్త పార్టీని స్థాపించే వరకు మీరు దూకుడు ఆగలేదు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నం.తెలంగాణ వ్యూహాలు ఇక్కడ పనిచేయవు.
కాబట్టి బిజెపి సైలెంట్ గా జనసేన ను ముందు తోస్తూ వారు వెనక ఉండి నడిపిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వీరి పొత్తు కనుక ఖాయం అయితే తర్వాత సంగతి తర్వాత.
ఇక టిడిపిని సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంచుతోంది బిజెపి.అయినప్పటికీ జనసేన టిడిపి కలిసే ఉన్నాయి అని అధిక శాతం నమ్ముతున్నారు.
ఈ విషయంపై టిడిపి జనసేన పార్టీని హెచ్చరించింది కూడా లేదు.ఇక్కడే వారి మాస్టర్ ప్లాన్ అర్థం చేసుకోవాలి.
బిజెపి-టిడిపి-జనసేన ముగ్గురు కలిస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వచ్చిన సానుభూతి, పోరాటయోధుడి ఇమేజ్ మళ్ళీ జగన్ కు వస్తుంది.

కాబట్టి బిజెపి సీన్ నుండి తప్పుకొని టిడిపి జనసేన పార్టీలను అలా వదిలేసింది.పరిస్థితులను బట్టి వీరి ఎంట్రీ లేదా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది అని తెలుస్తోంది.ఒకవేళ ప్రజలు వీరిద్దరి కలయికకు పట్టం కడితే తమ వంతు సాయం చేస్తూ తమకు కావలసినది రాష్ట్రంలో దక్కించుకుంటుంది లేదు అంటే జనసేనకి ఉన్న ప్యూర్ ఇమేజ్ తో పాటు వీరు కూడా ఎదిగేందుకు కావలసిన ప్రయత్నాలు చేస్తారు.
ఎటు చూసినా బిజెపి సేఫ్.ఇక అధికారంలోకి వేరే ఏదైనా పార్టీ వస్టే కేంద్రంలో ఎలాగు పవర్ ఉంది కాబట్టి అక్కడి నుండి కావలసినవి చేస్తూ తమ ఉనికిని కాపాడుకోవచ్చు.







