ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా ప్రయత్నాలు చేస్తూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసిపి (YCP) గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయ బావుటా ఎగరవేసింది.
ఇక టిడిపి మాత్రం గెలవలేకపోయింది.ఇక ఈసారి టిడిపి జనసేన (Janasena) పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలవబోతున్నాయి.కానీ జనసేన మాత్రం బిజెపిని తమ తో పొత్తు పెట్టుకోవాలి అని కోరుతోంది.ఎందుకంటే జనసేన తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకుంది.
ఇక ఆంధ్రా లో కూడా తమతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బీజేపీ లోని కొంత మంది జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టంగానే ఉన్నప్పటికీ టిడిపి ఉండటం వల్ల వాళ్లు జనసేనతో కలవడానికి ఇష్టపడడం లేదు.
ఇక ఇందులో కూడా కొంతమంది టీడీపీ (TDP) జనసేన పొత్తుతో కలవడానికి ఓకే అంటే మరి కొంత మంది మాత్రం వద్దని వారిస్తున్నారు.
దాంతో ఏపీలో బిజెపి దారెటూ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టిడిపి ఒంటరిగానే బరిలో నిలిచాయి.ఇక పవన్ కళ్యాణ్ మాత్రం వీరిద్దరికి సపోర్ట్ ఇచ్చారు.కానీ 2014లో బిజెపి టిడిపి కలిసి పోటీ చేశాయి.
మరి ఈసారి ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తుందా లేదా అనే అయోమయంలో బిజెపి కార్యకర్తలు మునిగిపోయారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ (Pawan kalyan) బిజెపిని తమతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా ప్రతిసారి ఆహ్వానిస్తున్నారు.ఎందుకంటే బీజేపీ వీరితో పొత్తులో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ప్రతిసారి బిజెపిని పొత్తు లో భాగంమవ్వాల్సిందిగా కోరుతున్నారు.అయితే పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం బాగానే ఉంది కానీ ఒకవేళ టిడిపి జనసేనతో బిజెపి కూడా కలిసి పోటీ చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడి (Chandrababu naidu) కి సీట్లు కేటాయించే విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికల షెడ్యూల్ పడుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే సంక్రాంతి లోపు అయిన లేదా సంక్రాంతి తర్వాత అయినా బిజెపి (BJP) ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలి.
లేకపోతే పార్టీ ఎటూ కాకుండా పోతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరి చూడాలి ఈసారి బిజెపి ఒంటరి పోరా లేక టిడిపి జనసేన తో కలిసి బరిలో నిలుస్తుందా అనేది.