ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు ఈనెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సుమారు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం చేసిన అవినీతిపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రోజుకో సబ్జెక్టుతో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.అదేవిధంగా ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరపాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.