న్యూస్ రౌండప్ టాప్ 20

1.కోదండరాం తో కాంగ్రెస్ నేతల భేటీ

టీజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తో కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ అయింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కోరింది. 

2.రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత

  స్వాతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. 

3.గవర్నర్ శుభాకాంక్షలు

 

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ప్రజలకు గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్  శుభాకాంక్షలు తెలిపారు. 

4.ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో చిరుత కలకలం

  ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది.వర్సిటీ పరిపాలన భవనం వద్ద కుక్కలపై చిరుత దాడికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 

5.బండి సంజయ్ పాదయాత్ర

 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగరం యాత్ర నేటికీ వేయి కిలోమీటర్లకు చేరుకుంది. 

6.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 

7.రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు తీర్పు

 

Advertisement

రాజకీయ పార్టీల ఉచిత హామీలపై డిఎంకె దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.హామీలను గుప్పించకుండా రాజకీయ పార్టీలను నియంత్రంచలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. 

8.మాణిక్యం ఠాకూర్ పై మర్రి శశిధర్ విమర్శలు

  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం టాగూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మరో శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మాణిక్యం ఠాగూర్ టీపీసీసీ రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా మారారని విమర్శించారు. 

9.కెసిఆర్ పై డీకే అరుణ కామెంట్స్

 

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని , ఆయన చెప్పేవన్నీ అబద్ధలేనని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. 

10.గోరంట్ల మాధవ్ వీడియో పై సిబిఐ కు ఫిర్యాదు

 హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదంపై ఏపీ హైకోర్టు న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ సిబిఐ చేశారు. 

11.పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి విమర్శలు

 

పవన్ ది కాపు జనసేన కాదు కమ్మ జనసేన అని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. 

12.వాజ్ పేయికి రాష్ట్రపతి , ప్రధాని ఘన నివాళి

   బిజెపి అగ్రనేత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి నాలుగో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ , ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు నివాళులర్పించారు. 

13.భారత్ లో కరోనా

 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

14.మహారాష్ట్రలో రెండు రైళ్లు డీ

  మహారాష్ట్రలోని గొండియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలు ను డీ కొట్టడం తో మూడు భోగీలు పట్టాలు తప్పాయి.ఈ ఘటన లో 50 మంది పైగా గాయాలయ్యాయి. 

15.భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

 

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి చెందిన 300 రూపాయల టికెట్లను ఈ రోజు విడుదల చేశారు. 

16.ఏ ఎన్ యూ స్నాతకోత్సవం

  ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 37,38 వ స్నాతకోత్సవం ను ఈ నెల 20 న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. 

17.వైద్య, ఆరోగ్యశాఖ పై జగన్ సమీక్ష

 

Advertisement

వైద్య ఆరోగ్యశాఖ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కొన్ని కొన్ని విషయాలపై అధికారులకు జగన్ కేవలం ఆదేశాలు జారీ చేశారు. 

18.నాదెండ్ల మనోహర్ కామెంట్స్

  టీచర్లను బోధనకు దూరం చేసి వదిలించుకునే కుట్ర జరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. 

19.బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డ్ ఏర్పాటు

 

బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డ్ ఏర్పాటు అయ్యింది.ఇందులో నరేంద్ర మోడీ తో పాటు, అమిత్ షా , మరో 9 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటు అయ్యింది. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,900   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52,250.

తాజా వార్తలు