న్యూస్ రౌండప్ టాప్ 20

1.ప్రజలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు

నల్గొండలో మరొక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను కోరారు.

2.దసరాకు స్పెషల్ రైళ్లు

రైల్వే ప్రయాణికుల రద్దీ ని దృష్టిలో పెట్టుకుని దసరాకు 620 ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

3.  అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణ దేవి కనకదుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.

4.చంద్రబాబు పిటిషన్ పై నేడు సుప్రీం లో విచారణ

టిడిపి అధినేత చంద్రబాబు పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ త్రివేదియాలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి.

5.హైకోర్టు మాజీ న్యాయమూర్తి మృతి

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు ఈరోజు మృతి చెందారు.

6.  గన్ మెన్ లను సరెండర్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఒంగోలు పోలీసులు తీరుపై మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు గన్ మెన్ లను  ఆయన సరెండర్ చేశారు.

7.హరీష్ రావు కామెంట్స్

Advertisement

కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.రాజనాథ్ సింగ్ ఇక్కడకు వచ్చి బాగా మాట్లాడుతున్నారని బిజెపి ది మేకపోతు గాంభీర్యం అని హరీష్ రావు విమర్శించారు.

8.మంత్రి పువ్వాడ విమర్శలు

మాకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని అని,  మా స్కీములను కాంగ్రెస్ కాపీ కొట్టి,  వరుసగా మేమే కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్నామని కొత్తగా డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు.

9.జేబీఎస్ మీదుగా బస్సులు

ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు జూబ్లీ బస్ స్టేషన్ మీదుగా విజయవాడకు వెళ్లే బస్సులు నడపాలని టిఎస్ఆర్టిసి నిర్ణయించింది.

10.ధాన్యం టెండర్ల గడువు పొడగింపు

యాసంగి ధాన్యం టెండర్ల దరఖాస్తు గడువును మళ్ళీ పొడిగించారు .17వ తేదీతో తుది గడుగు ముగుస్తుండగా,  మరో మూడు రోజులు పొడిగిస్తూ తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

11.తెలంగాణ వ్యాప్తంగా ఉచిత ఇంటర్ నెట్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్ సేవలు ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తుందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

12.  కోదండరాం తో మల్లు రవి భేటి

తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కలిశారు.   టీజేఎస్ కు సీట్ల కేటాయింపునకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగింది.

13.ధర్మ సమాజ్ పార్టీ తొలి జాబితా

వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ధర్మ సమాజ పార్టీ 53 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

14.మునుగోడు సీటు కై సిపిఐ పట్టు

పొత్తులో భాగంగా మునుగోడు సీటును తమకు ఇవ్వాలని కాంగ్రెస్ ను అడగాలని సీపీఐ నిర్ణయించింది.

15.రజాకార్ సినిమా విడుదల ఆపాలి

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఏకపక్షంగా తీసిన రజాకార్ సినిమా విడుదలను ఆపాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కి తెలంగాణ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి మనవరాలు ప్రతిభ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.

16.కాంగ్రెస్ గ్యారంటీ కవిత విమర్శలు

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు టిష్యూ పేపర్లు లాంటివని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు .

17.కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్

Advertisement

ప్రతిపక్ష పార్టీలో నేతలు కేసీఆర్ ను తిడితే ఓట్లు రాలవని , తెలంగాణను కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమిస్తేనే ఓట్లు వస్తాయని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు.

18.మరో 28 మందికి బి ఫారాలు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు బి ఫారాలు అందుకున్నారు ఈ మేరకు సీఎం కేసీఆర్ వాటిని అందజేశారు.

19.మూడో విడత పాదయాత్ర

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమాలై ఎన్ మన్ .ఎన్ మక్కల్ నినాదంతో మూడో విడత పాదయాత్రను ప్రారంభించారు.

20.నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ : ఐ ఎం డి

నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుండి పూర్తిగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తాజా వార్తలు