ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు( AP 10th Exam Results ) విడుదల అయ్యాయి.ఈ మేరకు విజయవాడలో పాఠశాల కమిషనర్ ఎస్.
సురేశ్ కుమార్ ( AP Commissioner of School Education Suresh Kuma )వెబ్ సైట్ లో 2023-24 రిజల్ట్స్ ను విడుదల చేశారు.అయితే మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ సంవత్సరం సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాల్లో అధికారులు నిర్వహించగా.సుమారు 6,16,615 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని సురేశ్ కుమార్ వెల్లడించారు.టెన్త్ పరీక్షల్లో మొత్తం 86.69 శాతం ఉత్తీర్ణత వచ్చింది.కాగా బాలురు కన్నా ఎక్కువ సంఖ్యలో బాలికలే ఉత్తీర్ణులయ్యారు.96.37 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా( Manyam district ) మొదటిస్థానంలో నిలిచింది.62 శాతం ఉత్తీర్ణతతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో నిలిచిందని ఎస్ సురేశ్ కుమార్ ప్రకటించారు.







