ప్రస్తుత రాజకీయాలు ట్రెడిషనల్ పాలిటిక్స్ కాకుండా మైండ్ గేమ్ మొదలెట్టాయి.ప్రత్యర్థుల బలహీనత మీద దెబ్బకొట్టేలా ప్లాన్ చేస్తున్నారు.
పార్టీలతో దోస్తీ చేస్తూనే సమయం వచ్చినప్పుడు సైడ్ చేసి మరో పార్టీతో జతకడుతున్నాయి.ఇక ఏపీలో వైసీపీ కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉండగా.
ఇప్పుడు టీడీపీ కూడా అదే దారిలో వెళ్తోంది.బీజేపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తుండటంతో బీజేపీ కూడా ఆసక్తి చూపుతోంది.
ఏపీ రాజకీయాల్లో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.ఆ రెండూ కూడా అధికారాన్ని వరసబెట్టి అందుకున్నాయి.
మరి ఆ రెండు పార్టీలకు కేంద్రంలోని బీజేపీతో చాలా సాన్నిహిత్యం ఉంది.వైసీపీకి బీజేపీతో మంచి రిలేషన్స్ కావాలని ఉంది.
అందుకే మూడేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి మరీ బీజేపీకి అన్ని విషయాల్లో మద్దతు తెలుపుతోంది.
ఇక గత ఎన్నికల కంటే ముందు టీడీపీ కూడా చంద్రబాబు మోడీ నేనూ అంటూ గొప్పగా చెప్పుకున్నారు.
కానీ అనూహ్యంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి యూపీఏతో సఖ్యతగా ఉన్నారు.ఇక ప్రస్తుతం మరోమారు బీజేపీతోనే కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అన్ని అనుకూలిస్తే ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య పొత్తులు కుదరవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇదే జరిగితే.
బీజేపీతో సఖ్యతగా ఉన్న వైసీపీ సంగతేంటి అన్న ప్రశ్న మొదలైంది.అయితే కేంద్రం పెద్దలు మాత్రం తెలివిగానే వ్యవహరిస్తున్నారట.
ఇక ఏపీలో బద్ద విరోదులుగా ఉన్న చంద్రబాబు జగన్ జాతీయ స్థాయిలో మాత్రం వారు మిత్రులే అనేలా ఉంది పరిస్థితి.అదెలా అంటే వారు ఇద్దరూ కేంద్రంలో బీజేపీకి మిత్రులే ఇక.
అయితే కేంద్రం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు టీడీపీ వైసీపీ రెండూ పోటీ పడి మరీ మద్దతు ఇచ్చాయి.ఇక లేటెస్ట్ గా రాష్ట్రపతి, ఉప రాష్త్రపతి ఎన్నికలకు కూడా రెండు పార్టీలు బీజేపీ అభ్యర్థికి ఓటేసి దోస్తీ ఉందని చెప్పుకున్నాయి.
ఇప్పుడు బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్ చేసింది.బాబుని అలా వదిలేస్తే ఆయన 2024 ఎన్నికల తరువాత దేశంలో మూడవ కూటమి కోసం ట్రై చేస్తారు… అదే జగన్ అలాంటి ప్రయత్నాలు చేసే ఆలోచన లేదు.
బాబుకు కాంగ్రెస్ వామపక్షాలు సహా దేశంలోని ప్రాంతీయ పార్టీలు అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి.అదే జగన్ కి కాంగ్రెస్ అంటే నచ్చదు… ఇక మిగిలిన రాజకీయ పార్టీలతో ఆయనకు పెద్దగా సంబంధాలు కూడా లేవు.
దీంతో బాబుతో జత కడితేనే రాజకీయంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.తెలంగాణాలో బీజేపీకి అధికారం దక్కినా దక్కవచ్చు.ఇక ఏపీలో జగన్ బాబులలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకి పోయేది ఏమీ లేదు.వారి మద్దతు ఎలాగూ ఉంటుంది.

ఏపీలో పొత్తులు పెట్టుకుని బాబుతో పోటీ చేసి ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకుంటే మూడవసారి కేంద్రంలో అధికారంలోకి రావచ్చు.ఒక వేళ సీట్లు తగ్గినా ఈ రెండు పార్టీల సాయం ఎటూపోదు.ఇక జగన్ మీద కేసులు ఉన్నాయి.బాబుకు కేసుల భయం ఉంది.ఇది కూడా బీజేపీ రాజకీయానికి కలసివస్తోంది.మొత్తానికి ఏపీ విషయంలో పక్కా క్లారిటీగా అర్ధమయ్యాకనే బీజేపీ బాబుని చేరదీసి జగన్ వైపు సీరియస్ గా చూస్తోందని అంటున్నారు.
ఇదే జరిగితే జగన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడనేదే ప్రశ్న.బాబుతో ఏపీలో పొత్తులు ఉన్నా జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో దోస్తీ చేయడానికే ఆయన ఇంట్రెస్ట్ గా ఉంటారని అంటున్నారు.
దీంతో బీజేపీ ఏపీలో మీలో మీరు మీరు పోట్లాడుకోండి.ఢిల్లీ వచ్చి మాతో కలవండి అంటూ చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు.