దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఒక విభిన్నమైన చిత్రాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే.మూడు జంటల నేపథ్యంలో సాగే కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక వివరాలు అయితే బయటకు రాలేదు.కాని మీడియాలో మాత్రం కుప్పలు తెప్పలుగా ఈ చిత్రం గురించిన వార్తలు వస్తున్నాయి.
చిత్ర యూనిట్ సభ్యులు స్పందించకున్నా కూడా విశ్వసనీయంగా అందుతున్న సమాచారం కనుక ఖచ్చితంగా నిజమైనదే అయ్యి ఉంటుందని అంటున్నారు.
తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త ఒకటి వస్తుంది.
అదేంటి అంటే యంగ్ హీరో నాగశౌర్య ఒక కీలక పాత్రలో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.ఆయనకు జోడీగా స్వీటీ అనుష్క నటించబోతుందట.వీరిద్దరి కాంబినేషన్ అక్క తమ్ముడు అన్నట్లుగా ఉంటుంది.అనుస్క ముందు నాగశౌర్య ఏం సరిపోతాడు అంటూ నెటిజన్స్ ఎద్దేవ చేస్తున్నారు.
అయితే విభిన్నమైన సినిమా అంటున్నారు కనుక రాఘవేంద్ర రావు ఏదైనా మాయ చేస్తాడేమో అనే అనుమనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం అనుష్క ‘నిశబ్దం’ అనే చిత్రంను చేస్తోంది.లేడీ ఓరియంటెడ్ కథాంశంతో అనుష్క ఈ చిత్రంలో నటిస్తోంది.దాదాపు మూడు సంవత్సరాలుగా అనుష్క చాలా చాలా తక్కువ సినిమాలు చేస్తుంది.
బాహుబలి చిత్రం తర్వాత అనుష్క స్టార్‌డం ఎక్కడికో వెళ్తుంది అనుకుంటే ఆమె మాత్రం సినిమాల సంఖ్య చాలా తక్కువ చేసింది.వచ్చే ఏడాది నుండి అయినా అనుష్క వరుసగా సినిమాలు చేస్తుందేమో చూడాలి.







