బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ... మరోసారి తల్లి కాబోతుందా అంటూ కామెంట్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) ఒకరు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈమె క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kholi ) ని ప్రేమించిన తర్వాత కొంతకాలం పాటు ఇద్దరు ప్రేమలో కొనసాగి అనంతరం వివాహం చేసుకున్నారు.

 Anushka Sharma Second Pregnancy News Goes Viral In Social Media , Anushka Sharma-TeluguStop.com

ఇలా పెళ్లి తర్వాత అనుష్క సినిమాలను కాస్త తగ్గించిందని చెప్పాలి అయితే ఈ దంపతులకు కూతురు జన్మించడంతో అనుష్క శర్మ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె నిర్మాతగా మారి పలు సినిమాలు చేస్తున్నారు.

Telugu Anushka Sharma, Baby Bump, Pragency, Virat Kholi-Movie

ఇక అనుష్క తన కుమార్తె ఆలనా పాలన చూసుకుంటూ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈమె గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.అనుష్క శర్మ మరోసారి తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.అయితే ఈ విషయాన్ని అనుష్క శర్మ ఎక్కడ తెలియజేయలేదని చెప్పాలి.ఈమె ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వస్తున్నా కూడా ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో ఈమె ప్రెగ్నెంట్ అంటూ అందరూ భావించారు.

Telugu Anushka Sharma, Baby Bump, Pragency, Virat Kholi-Movie

ఇకపోతే తాజాగా అనుష్క శర్మ షేర్ చేసినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూస్తే కనుక తప్పకుండా ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ అర్థమవుతుంది.ఈ ఫోటోలో అనుష్క శర్మ బేబీ బంప్( Baby Bump ) కనిపించడంతో అందరూ కూడా ఈమె రెండోసారి తల్లి కాబోతుందని భావిస్తున్నారు.

మొబైల్ వన్ ప్రమోషన్ కోసం అనుష్క శర్మ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.ఈ పోస్ట్‌ కు సమయం చాలా వేగంగా పరిగెడుతోందని రాసుకొచ్చారు.ఆ ఫోటో చూసిన వెంటనే అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.మరి ఈమె ప్రెగ్నెన్సీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube