ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతానంటోన్న స్వీటీ

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించి లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోవడంతో ఈ సినిమా యావరేజ్ చిత్రంగా నిలిచింది.ఇక ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్న అనుష్క ఈ సినిమా ఫ్లాప్ కావడంతో సైలెంట్ అయిపోయింది.

అయితే నిశ్శబ్ధం చిత్రం రిజల్ట్ తనపై లేదంటోంది ఈ బ్యూటీ.తన నెక్ట్స్ చిత్రాన్ని ఎంచుకునే పనిలో పడిందట అనుష్క.

ఇప్పటికే కొందరు డైరెక్టర్స్‌కు ఈ మేరకు సూచనలు కూడా చేసిందట.ఈ క్రమంలోనే అనుష్క ఓ పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే పలువురికి ఈ మేరకు సూచనలు కూడా చేసిందట ఈ బ్యూటీ.అటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత వరుసబెట్టి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుండటంతో ఆయన్ను ఫాలో అవ్వాలని అనుష్క భావిస్తోంది.

దీంతో అనుష్క కూడా పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకునేందుకు రెడీ అవుతోంది.మొత్తానికి నిశ్శబ్ధం చిత్రం రిజల్ట్‌తో అనుష్క తన నెక్ట్స్ చిత్రం ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందనే విషయం అర్ధమవుతోంది.

అయితే అనుష్కకు పాన్ ఇండియా చిత్రం ఎంతవరకు సెట్ అవుతుంద అని కొందరు అభిప్రాయపడ్డారు.ఇక నిశ్శబ్ధం చిత్రంలో అనుష్క మూగ, చెవుడు అమ్మాయిగా కనిపించగా, మాధవన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను కోన వెంకట్ ప్రొడ్యూస్ చేయగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.మరి అనుష్క పాన్ ఇండియా ప్లాన్ ఎంత వర్కవుట్ అవుతుందో చూడాలి.

అల్లు అర్జున్ తో డాన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు