నిశబ్ధం ట్రైలర్ టాక్: సైలెంట్‌గానే కానిచ్చేసిన అనుష్క!  

Anushka Nishabdham Tailer Released - Telugu Anjali, Anushka, Madhavan, Nishabdham, Telugu Movie News, Trailer

అందాల భామ అనుష్క నటించిన తాజా చిత్రం నిశబ్ధం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ మొదలు, టీజర్ వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Anushka Nishabdham Tailer Released

ఇక ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండటంతో భాగమతి లాగా ఇది కూడా సూపర్ సక్సెస్ కావడం ఖాయమని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.వారి అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో అనుష్క ఓ మూగ, చెవిటి అమ్మాయిలా మనకు కనిపిస్తుంది.ఇక ఈ సినిమా కథ ఓ పాడుబడ్డ ఇంటిలో జరుగుతుందని మనకు ట్రైలర్‌తో తెలిపారు.

నిశబ్ధం ట్రైలర్ టాక్: సైలెంట్‌గానే కానిచ్చేసిన అనుష్క-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని, అవి చేసే హింసను అరికట్టేందుకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంజలి వస్తుంది.అయితే మూగ,చెవిటి అనుష్కకు ఈ దెయ్యాలతో సంబంధం ఏమిటి? అసలు ఆ ఇంటితో అనుష్కకు ఎలాంటి సంబంధం ఉంది? మాధవన్ ఎవరు? అనే అంశాలను ప్రశ్నించేలా ఈ ట్రైలర్ చేస్తుంది.

ఇక ఈ సినిమాలో మాధవన్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ సినిమాను హేమంత్ ముధకర్ డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Nishabdham Tailer Released Related Telugu News,Photos/Pics,Images..

footer-test