Anupama Parameswaran: బ్లాక్ సారీలో అనుపమ స్టిల్స్.. మూతికి సర్జరీ చేయించుకుందంటూ నెటిజన్స్ ట్రోల్స్?

Anupama Stills In Black Saree Netizens Trolling That She Has Undergone Face Surgery Details, Anupama, Anupama Black Saree, Anupama Parameswaran, Anupama Parameswaran Face Surgery, 18 Pages Movie, Anupama Movie Offers

కొన్ని కొన్ని సార్లు హీరోయిన్స్ షేర్ చేసుకునే పోస్టులకు నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా వారి ఫేస్ లపై బాగా కామెంట్లు చేస్తుంటారు.

 Anupama Stills In Black Saree Netizens Trolling That She Has Undergone Face Surg-TeluguStop.com

వాళ్ళ ఫేసులలో కాస్త తేడాగా అనిపిస్తే చాలు వెంటనే రకరకాలుగా ట్రోల్ చేసి నెట్టింట్లో వైరల్ చేస్తారు.తాజాగా హీరోయిన్ అనుపమ పై కూడా టార్గెట్ చేశారు నెటిజన్స్.

ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.

ఈ బ్యూటీ గురించి అందరికి పరిచయమే.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.

తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.

తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.ఆ తర్వాత నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ ముద్దుగుమ్మకు.

నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి.

అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు, కామెంట్ లు పొందుతూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా బాగా ట్రోల్స్ ఎదుర్కుంటుంది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో బ్లాక్ సారీలో ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ అందంగా కనిపించింది.తన ఫోటోలను చూసిన తన ఫాలోవర్స్ లైక్స్ కొడుతున్నారు.

ఇక మరి కొంతమంది మాత్రం తన ఫేస్, హెయిర్ ను చూసి ట్రోల్స్ చేస్తున్నారు.తను మూతికి సర్జరీ చేయించుకుంది అంటూ అందుకే తన మూతి అలా కనిపిస్తుంది అని అంటున్నారు.

ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికొస్తే.ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలలో అనుపమను తీసుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక 18 పేజెస్ సినిమాలో హీరో నిఖిల్ సరసన నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇటీవలే కార్తికేయ2 తో ప్రేక్షకుల ముందుకి రాగా మంచి సక్సెస్ అందుకుంది.ఇక కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా బాగా అవకాశాలు అందుకుంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube