అనుపమను చూసి భయపడుతున్న ఫ్యాన్స్.. మరి ఇలా తయారైందేంటి?

టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికి పరిచయమే.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.

 Anupama Parameswaran Funny Face Filter Gone Wrong Video Viral Details, ,anupama,-TeluguStop.com

తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.

అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.ఆ తర్వాత నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా ఓ పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి.

అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు, కామెంట్ లు పొందుతూ ఉంటుంది.నాచురల్ గా కనిపిస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంది.

అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో బాగా సందడి చేస్తుంది.

తన ఫేస్ ఫన్నీగా కనిపించిన కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆ ఫోటోలను పంచుకుంటుంది.ఇప్పటికే అటువంటి ఫోటోలు చాలా పంచుకుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో పంచుకుంది.

అందులో తాను ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఫేస్ తో రీల్ చేయగా అందులో తన మొత్తం చాలా విచిత్రంగా కనిపించింది.

దీంతో తనను అలా చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

ఏంటి అనుపమ ఇలా అయింది అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇక ఓ నెటిజన్.

లైఫ్ లో ఇలాంటి రోజు వస్తది అనుకోలే.ఫస్ట్ టైం అనును చూడాలంటే భయంగా ఉంది అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

ఆ వీడియో కూడా చాలా వైరల్ గా మారింది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా దూసుకుపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube