తెలుగు చిత్ర పరిశ్రమలో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఈ ఏడాది ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈమె హీరో నిఖిల్ సిద్ధార్థతో కలిసి కార్తికేయ 2, 18 పేజస్సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ రెండు సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో అనుపమకు ఇతర సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.
ఇలా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
అనుపమ నటించిన బటర్ ఫ్లై సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగంగా నిర్వహిస్తున్నారు.ఇకపోతే అనుపమ రెండు సినిమాలు మంచి హిట్ అవడంతో తన తదుపరి సినిమాలకు రెమ్యూనరేషన్ భారీగా పెంచారట.

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ఒక్కో సినిమాకు 60 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట.అయితే ఈ ఏడాది ఈమె నటించిన ఈ రెండు సినిమాలు మంచి హిట్ కావడంతో తన రెమ్యూనరేషన్ ఏకంగా 1.2 కోట్ల రూపాయలకు పెంచినట్టు తెలుస్తుంది.ఇలా ఒకేసారి తన రెమ్యూనరేషన్ రెండింతలు పెంచడంతో నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈమెకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని పలువురు నిర్మాతలు ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.







