మజ్ను సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఇమాన్యూయేల్. ఊహించని విధంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టే అవకాశం సొంతం చేసుకున్న అనూ బేబీకి అదృష్టం కలిసిరాలేదు.
స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఉన్న కూడా బ్యాడ్ టైం ఈమెకి హిట్ రాకుండా చేశాయి.దీంతో ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది.
ఇతర మలయాళీ భామల తరహాలో డ్రెస్సింగ్ లో పొడుపు లేకుండా దర్శకులకి నచ్చే విధంగా ఉండటంతో పాటు, రొమాంటిక్ సన్నివేశాలకి సైతం అనూ ఇమాన్యూయేల్ ఒకే చెప్పింది.అయిన కూడా ఈ పాపకి అవకాశాలు రావడం లేదు.
తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.ఇదిలా ఉంటే అప్పుడప్పుడు ఫోటో షూట్ లతో మెరుస్తున్న అనూ పాప కూడా వెబ్ సిరీస్ లవైపు దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ప్రాజక్టులు చర్చల దశలో వున్నట్టు తెలుస్తోంది.వెబ్ సిరీస్ లు అయితే ఫ్యూచర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అలాగే తన గ్లామర్ తో బోల్డ్ వెబ్ సిరీస్ లు కూడా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని భావించి అనూ అటువైపు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.