పిల్లలకు యాంటీబయాటిక్ ఇస్తున్నారా..? ఈ తప్పులు చేయకండి

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.చిన్నపిల్లలకు మందులు ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

 Antibiotics Are Given To Children Don't Make These Mistakes , Antibiotics, Child-TeluguStop.com

చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.ఈ టెన్షన్‌లో పిల్లలకు ఏది పడితే అది ఇస్తూ ఉంటారు.

దాని వల్ల పిల్లల అనారోగ్య సమస్య మరింత పెరిగే అవకాశముంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో టెన్షన్‌కు గురై సొంత చికిత్స చేస్తే ప్రమాదమని చెబుతున్నారు.

Telugu Antibiotics, Immunity, Tips-Latest News - Telugu

పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు త్వరగా తగ్గడానికి యాంటీబయాటిక్స్( Antibiotics ) ఇస్తారు.కానీ ప్రతిసారి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు.డాక్టర్లు సూచించారని తల్లిదండ్రులు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు.దీంతో తల్లిదంద్రులు కూడా దీనిపై అవగాహన కలిగి ఉండటం మంచిది.యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల చాలా దుష్ఫరిణామాలు ఉంటాయి.అందుకే వాటిని ఎక్కువగా చిన్నపిల్లలకు ఇవ్వకూడదు.

అత్యవసరమైనప్పుడు డాక్టర్లను సంప్రదించి తగిన మోతాదులోనే పిల్లలకు యాంటీబయాటిక్స్ అందించాలి.రోగాన్ని, తీవ్రతను బట్టి తక్కువ మోతాదుతోనే పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది.

Telugu Antibiotics, Immunity, Tips-Latest News - Telugu

ఇతరులకు సూచించిన యాంటీబయాటిక్స్‌ను మీ పిల్లలకు వాడటం సరికాదు.ఇంతకుముందు అనారోగ్యానికి గురైనప్పుడు మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను చాలా రోజుల తర్వాత మళ్లీ ఉపయోగించడం మంచిదికాదు.బ్యాక్టీరియా ( Bacteria )వల్ల వచ్చే ఇన్పెక్షన్లను తగ్గించడానికి యాంటీబయాటిక్స్ ఉపయోగించాలి.యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాను చంపుతాయి.అంతేకాకుండా వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి.వివిధ రకాల యాంటిబయాటిక్స్ మార్కెట్‌లో ఉన్నాయి.

వాటిల్లో మంచిది ఎంచుకోవాలి.కొంతమంది పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్య రాగానే ముందుగా యాంటీబయాటిక్స్ వేస్తారు.

అలా చేయడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది.యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్ల పిల్లలకు భవిషత్తుల్లో చాలా ఇబ్బందులు వస్తాయి.

రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల భవిషత్తులో ఏవైనా జబ్బులు వచ్చినా తట్టుకోలేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube