తెలంగాణలో సీఎం కేసీఆర్ ( KCR ) మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి అని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈసారి గెలుపు అంత సులభంగా కనిపించడం లేదు.ఎందుకంటే ఇప్పటికే ఓవైపు కాంగ్రెస్ తరుముతుంటే మరోవైపు బిజెపి అన్నట్లుగా రెండు పార్టీలు ఆయనను ఇరకాటంలో పెడుతున్నాయి.
అలాగే ఆయన ఈసారి ఓడిపోతాను అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కామారెడ్డి( Kamareddy ) , గజ్వేల్ రెండు చోట్ల నుండి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు.అయితే ఇటు గజ్వేల్ లో ఈటెల రాజేందర్( Etela Rajender ) అటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆయనని ఇరకాటంలో పెట్టడానికి రెడీ అయ్యారు.
అంతేకాదు ఒక తలనొప్పి పోతే మరొక తలనొప్పి కేసీఆర్ కి వచ్చి పడుతుంది.తాజాగా గజ్వేల్ లో కేసీఆర్ కి మరో కొత్త టెన్షన్ వచ్చింది.అదేంటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది.ఇక నామినేషన్లను వెరిఫికేషన్ చేయడమే మిగిలింది.
అయితే గజ్వేల్ ( Gajwel ) లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.అదేంటంటే ఈసారి కెసిఆర్ పోటీ చేసే గజ్వేల్ లో ఆయన పై 145 మందితో 154 నామినేషన్లు వేశారు.

దీంతో ఒక్కసారిగా కెసిఆర్ షాక్ అయ్యారు.ఇక కేసీఆర్ పై సొంత నియోజకవర్గంలోనే ఇంతమంది నామినేషన్లు వేయడం బట్టి చూస్తే ఆయన గజ్వేల్ లో ఎంత పేరు తెచ్చుకున్నారో ఎంత అభివృద్ధి చేశారో అర్థం చేసుకోవచ్చు.అయితే 154 నామినేషన్లు రావడంతో కేసీఆర్ కి లో భయం పట్టుకుంది.154 నామినేషన్లు అంటే మామూలు విషయం కాదు.దాంతో గెలుస్తానో లేదో అన్న భయంతో కేసీఆర్ లో టెన్షన్ మొదలై తనపై వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించే పనిలో పడ్డారట.

కెసిఆర్ పై నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువ శాతం మంది రంగారెడ్డి ( Rangareddy ) వట్టినాగులపల్లి ఫ్లాట్స్ బాధితులు అలాగే రైతులు ఉన్నారట.అయితే చెరుకు ఫ్యాక్టరీలను మళ్లీ రీ ఓపెన్ చేయించాలని రైతులు అధిక సంఖ్యలో కేసీఆర్ కి వ్యతిరేకంగా నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది.దీంతో కేసీఆర్ తన పూర్తి ఫోకస్ గజ్వేల్ పై పెట్టినట్టు సమాచారం.
మరి చూడాలి ఈసారి కెసిఆర్ గజ్వేల్ లో గట్టెక్కుతాడో లేదో.







