మరో ప్రస్థానం రివ్యూ: కిల్లర్‌గా తనీష్ ఎలా నటించాడంటే?

దర్శకుడు జానీ దర్శకత్వంలో తాజాగా విడుదలైన సినిమా ‘మరో ప్రస్థానం’.ఈ సినిమాలో తనీష్ హీరోగా నటించాడు.

 Maha Prasthanam Review How Did Tanish Act As A Killer, Tanish, Tollywood, Actro,-TeluguStop.com

ముస్కాన్ సేథి హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తో పాటు పలువురు నటీ నటులు నటించారు.

ఈ సినిమాకు సునీల్ కశ్యప్ తన సంగీతాన్ని అందించాడు.ఉదయ్ కిరణ్ సమర్పణలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ బ్యానర్ పై మిర్త్ మీడియాలో ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కాగా చాలా గ్యాప్ తర్వాత సినిమాలలో అడుగుపెట్టిన తనీష్ ప్రేక్షకులను ఎలా మెప్పించాడో చూద్దాం.

కథ:

ఇక ఈ సినిమాకు జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనే ఉపశీర్షిక పెట్టగా.ఈ సినిమా మొత్తం క్రైమ్ నేపథ్యంలో మంచి ప్రేమకథతో తెరకెక్కింది.ఇక ఇందులో కబీర్ సింగ్.రాణే బాయ్ అనే గ్యాంగ్ లీడర్ పాత్రలో నటించాడు.ఇక తనీష్ శివ అనే పాత్రలో నటించగా.

శివ రాణే బాయ్ కు రైట్ హ్యాండ్ గా ఉంటాడు.ఇందులో శివ క్రిమినల్ గా నటించగా.

ముస్కాన్ సేథి నైని అనే పాత్రలో నటించింది.ఇక శివ ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.

నైని తో శివ తను క్రిమినల్ అనే విషయాన్ని చెప్పడు.దీంతో అతడు నేరాలు చేయడం మానేసి తన భార్యతో గోవాలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు.

గోవా కి వెళ్లితిరిగి వచ్చాక శివకు ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది.దాంతో అతడిలో మార్పు వస్తుంది.

అప్పటి నుంచి తన గ్యాంగ్ సీక్రెట్స్ ను లీక్ చేస్తూ.తన గ్యాంగ్ లోని వ్యక్తులనే చంపేస్తూ ఉంటాడు.

అలా శివ లో ఎటువంటి మార్పు రావడానికి కారణం ఏంటి అని.తన గ్యాంగ్ చేసిన ప్లాన్ బ్లాస్ట్ లను శివ ఎలా ఆపాడు అని.ఇక అదే సమయంలో జర్నలిస్టు సమీర పాత్రలో నటిస్తున్న భాను శ్రీ మెహ్రా రంగంలోకి దిగుతుంది.ఆమెకు ఈ గ్యాంగ్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని.ఆమెను ఎందుకు టార్చర్ పెడుతున్నారు అని.ఇక చివరికి శివ ఇందులో ఏం సాధిస్తాడు అనే నేపథ్యంలో కథ ఉంటుంది.

నటినటుల నటన:

ఇక ఇందులో తనిష్ ఒక క్రిమినల్ పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.ఇక హీరోయిన్ ముస్కాన్ సేథి తన నటనతో కొంతవరకు ఆకట్టుకుంది.

ఆమె ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.వీళ్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో తమ పాత్రలకు న్యాయం చేశారు.

Telugu Actro, Killer, Maha Prasthanam, Review, Tanish, Tollywood-Movie

విశ్లేషణ:

ఈ సినిమా గురించి విశ్లేషించాలి అంటే ఇందులో తనిష్ పాత్ర తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవ్వలేదు.నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోగా ఫిజిక్ పరంగా మాత్రం పాత్రకు డామినేట్ చేశాడు.

ప్లస్ పాయింట్స్:

తనీష్ నటన ప్లస్ పాయింట్ గా మారింది.నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంది.

కొన్ని క్రైమ్ సీన్స్ ఇంటర్వెల్ లో ట్విస్ట్ బాగా ఆసక్తిగా అనిపించింది.

Telugu Actro, Killer, Maha Prasthanam, Review, Tanish, Tollywood-Movie

మైనస్ పాయింట్స్:

తనీష్ పాత్ర కాస్త ఓవర్ బిల్డప్‌గా అనిపించింది.కొన్ని లాజిక్స్ మిస్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది.కెమెరా పనితనం అంతగా ఆకట్టుకోలేదు.బోరింగ్ గా అనిపించింది.

బాటమ్ లైన్:

సింగిల్ షాట్‌లో తీయగా.రొటీన్ క్రైమ్ డ్రామా వ్యవహారంలో సాగినట్లు అనిపించింది.కొంతవరకు ఎమోషనల్ సీన్స్, ట్రైన్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube