Whatsapp : వాట్సప్ లో మరో ప్రైవసీ ఫీచర్.. స్క్రీన్ షాట్ బ్లాక్ ఫీచర్ తో మరింత భద్రత..!

వాట్సప్( Whatsapp ) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.

మెటా యజమాన్యం( Meta ownership ) వాట్సప్ యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తోంది.

ప్రైవసీకి సంబంధించిన సమస్యలను అధిగమించడం కోసం ఎప్పటికప్పుడు తగ్గిన చర్యలను తీసుకుంటుంది.వాట్సప్ వినియోగదారులకు మెరుగైన సేవలు, భద్రత దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను( Brand new features ) పరిచయం చేస్తూనే ఉంది.

ఇప్పటికే వాట్సప్ వెబ్ వెర్షన్ కోసం చాట్ లాక్ ఫీచర్ పై పనిచేస్తోంది.ఈ ఫీచర్ ద్వారా ఫోన్ నెంబర్లను షేర్ చేయకుండా వినియోగదారులు ఇతరులతో సులభంగా కనెక్ట్ కావచ్చు.

తాజాగా వినియోగదారుల ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్ షాట్లను తీయకుండా యూజర్లను బ్లాక్ చేసుకునేందుకు వాట్సప్ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.ప్రస్తుతం వాట్సప్ లో గుర్తుతెలియని యూజర్ ల నుంచి ప్రొఫైల్ ఫోటోలను హైట్ చేసే ఆప్షన్ ఉండేది.మనకు తెలియని వాట్సప్ యూజర్లు మన ప్రొఫైల్ డిపి ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకునే వీలు ఉండేది.

Advertisement

అయితే స్క్రీన్ షాట్ బ్లాక్ ఫీచర్ ( Screen shot block feature )అందుబాటులోకి వస్తే.వాట్సప్ ఉపయోగించే ఇతర యూజర్లు ఇకపై మన డిపి లను స్క్రీన్ షాట్ తీసే అవకాశం ఉండదు.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వ్యక్తిగత ఫోటోల డౌన్లోడ్, షేరింగ్ చేయకుండా పూర్తిగా నియంత్రించవచ్చు.

వాట్సప్ ప్లాట్ ఫారంలో వేధింపుల ప్రమాదాలను తగ్గించడానికి లక్ష్యంగా ఈ స్క్రీన్ షాట్ బ్లాక్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది.ఈ ఫీచర్ బీటా టెస్టర్ లకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలో వాట్సప్ ఉపయోగించే యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇటీవలే వాట్సప్ బీటా, గూగుల్ ప్లే స్టోర్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు