దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మద్యం కుంభకోణంలో మరొకరిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఇవాళ బుచ్చిబాబును సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు.
కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బుచ్చిబాబు కొంతకాలం చార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేశారు.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఉదయం బుచ్చిబాబును అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.







