కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపల్ ఛైర్మన్( Municipal Chairman ) పీఠం చేరింది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీలో కొత్త చైర్ పర్సన్ గా గుర్రం కవిత( Gurram Kavitha ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా పది మంది కౌన్సిలర్లు మద్ధతు తెలిపారు.అయితే గత నెల 9న మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
దీంతో బీఆర్ఎస్ పార్టీ( BRS Party )కి చెందిన సావిత్రి ఛైర్ పర్సన్ పదవిని కోల్పోయారన్న సంగతి తెలిసిందే.దీంతో కొత్త ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన గుర్రం కవిత ఎన్నికయ్యారు.