బన్నీ త్రివిక్రమ్ కాంబో లో మరో సినిమా...త్రివిక్రమ్ కి వేరే హీరో దొరకడం లేదా..?

స్టైలిష్ స్టార్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ( Allu Arjun )ప్రస్తుతం సుకుమార్ ( Sukumar ) దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2: ది రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఐతే, బన్నీ ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఓ బిగ్ అప్ డేట్ వచ్చింది.

 Another Movie In Bunny Trivikram Combo...trivikram Can't Find Another Hero..? T-TeluguStop.com

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ( Trivikram Srinivas , )తో బన్నీ కొత్త ప్రాజెక్ట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు.జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు.

మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని ప్రకటించేందుకు మేకర్స్ యూట్యూబ్‌లో ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు.టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాము అని చెప్పుకొచ్చారు.హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి.ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

 Another Movie In Bunny Trivikram Combo...Trivikram Can't Find Another Hero..? T-TeluguStop.com

ఇక త్రివిక్రమ్ వరుసగా అల్లు అర్జున్ తో సినిమా చేయడం తో మిగితా హీరోల అభిమానులు త్రివిక్రమ్ కి ఒక అల్లు అర్జున్ తప్ప వేరే హీరోలు ఎవరు దొరకడం లేదా ఎందుకు ఇలా అల్లు అర్జున్ తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు అంటూ కొందరు నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇక ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ కొడతారా అనేది చూడాలి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమా పూర్తి చేసుకొని పవన్ కళ్యాణ్ చేసే సినిమాలకి స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించే పని లో ఉన్నట్టు గా తెలుస్తుంది…అలాగే బన్నీ కూడా సుకుమార్ తో చేస్తున్న సినిమా పూర్తి చేసుకొని ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వనున్నట్లు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube