వైసీపీలో మరో ఎమ్మెల్యే స్వరం పెంచాడు.పార్టీతోపాటు కార్యకర్తలు బతికి బట్టకట్టాలంటే వారిని ఆనందపరచాలని కుండబద్దలు కొట్టారు.
అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీలు ముగిసిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా పేర్నమిట్ట సమీపంలో ఏర్పాటు చేసిన జిల్లా ప్లీనరీకి పార్టీ శ్రేణులు పెద్దయెత్తున తరలి వచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన దర్శి ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కార్యకర్తలు వైసీపీలో సంతోషంగా లేరని తేల్చారు.తన నియోజక వర్గంలో 100 కోట్ల రూపాయల పనులు చేస్తే బిల్లులు ఇంతవరకు చెల్లించలేదన్నారు.
వారికి బిల్లులు ఇచ్చే ఏర్పాటు చేసి వారిని ఆనందపరచాల్సిన అవసరముందన్నారు.సాధారణంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి డబ్బులు వేస్తే పెరు జగన్ కు వస్తుందన్నారు.
కానీ దీనివల్ల ఎమ్మెల్యేలకు గాని కార్యకర్తలకు గాని పెరురాదని కుండబద్దలు కొట్టారు.స్థానికంగా రోడ్లు వేసి…వాటికి బిల్లులు వస్తేనే అంతా బాగుంటుందని మద్దిసెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజులుగా జిల్లాలో బాలినేని వ్యాఖ్యలు దుమారం రేకిత్తిస్తుండగా…ఇప్పుడు మద్దిసెట్టి సైతం ఏకంగా సిఎమ్ ప్రస్తావన తేవడం జిల్లా వైసీపీ రాజకీయం వేడెక్కింది.







