విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో రోజుకో వివాదం తెరపైకి వస్తుంది.
తాజాగా రెవెన్యూ అధికారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది.అమ్మవారి దర్శనానికి వెళ్తున్న ఇంఛార్జ్ సబ్ కలెక్టర్ మోహన్ ను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఇంఛార్జ్ సబ్ కలెక్టర్ నన్నే అడ్డుకుంటావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆపే పరిస్థితులు రావద్దొంటే ఐడీ కార్డు వేసుకోవాలని పోలీసులు సూచించారు.
స్పందించిన ఆలయ అధికారులు సబ్ కలెక్టర్ కు సర్దిచెప్పి దర్శనానికి పంపించారు.







