నదిలో కొట్టుకుపోతున్న కుక్కను కాపాడిన మరో కుక్క.. నెటిజన్లు ఫిదా

ప్రస్తుతం అంతా డిజిటల్ యుగంలో ఉన్నారు.మానవ సంబంధాలు దూరం అవుతున్నాయి.

 Another Dog That Saved The Dog That Was Being Washed Away In The River Netizens-TeluguStop.com

ఒకే ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలు కూడా మెసేజ్‌లు ద్వారా కమ్యూనికేట్ అవుతున్నారు.ఇక ఎవరికైనా సాయం చేయాలంటే ఎవరికీ మనసు ఒప్పడం లేదు.

అందరిలోనూ స్వార్థం బాగా పెరిగి పోతోంది.సాటి మనిషి కష్టంలో ఉంటే మనకు ఎందుకులే అనే మనస్తత్వంతో దూరంగా జరిగిపోతున్నారు.

మొసలి కన్నీరు కారుస్తుంటారు.ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి సమాజంలో కాస్త అయినా విలువలు ఉండేవి.

ప్రస్తుతం అందరిలోనూ స్వార్థం పెరిగి పోయి, పక్క వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, పట్టించుకునే తీరిక లేని పరిస్థితికి చేరుకున్నారు.ఇలాంటి సందర్భంలో నదిలో కొట్టుకుపోతున్న ఓ కుక్కను మరో కుక్క చూసింది.

నాకెందుకులే అని అది ఊరుకోలేదు.ప్రాణాలకు తెగించి, ఆ కుక్కను కాపాడింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఓ కుక్క నీటిలో మునిగిన మరో కుక్కను రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుక్క ఒక కొమ్మను తీసుకురావడానికి నదిలోకి వెళుతుంది.కానీ అది బ్యాలెన్స్ కోల్పోయి నది ప్రవాహంలో కొట్టుకుపోయే స్థితికి చేరుకుంటుంది.

దీనిని మరో కుక్క దూరం నుంచి చూస్తుంది.తన స్నేహితుడైన కుక్క నదిలో కొట్టుకుపోవడం చూసి తల్లడిల్లి పోతోంది.

వెంటనే అది అక్కడకు చేరుకుని కొట్టుకుపోతున్న కుక్కను కాపాడుతుంది.కొమ్మను తీసుకురావడానికి కుక్క నదిలోకి దూకినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది.

అయితే కొమ్మ ముక్కను నదిలోకి ఎవరు విసిరారు అనేది స్పష్టంగా తెలియరాలేదు.కుక్క కొమ్మను పట్టుకోగలిగినప్పుడు, బలమైన నది ప్రవాహం కారణంగా అది నియంత్రణ కోల్పోతుంది.

మరొక కుక్క వచ్చి దానిని రక్షిస్తుంది.ఈ వీడియోను గాబ్రియెల్ కార్నో అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇప్పటి వరకు ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి.ఇక ప్రాణాపాయంలో ఉన్న కుక్కను కాపాడిన మరో కుక్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియో పలువురికి కనువిప్పు కావాలని అంతా కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube