మరో వివాదంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.

తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న చెరుకు సుధాకర్ పై ఫోన్ లో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

చెరుకు సుధాకర్ ను చంపేందుకు తన అనుచరులు వంద వాహనాల్లో తిరుగుతున్నారని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సమాచారం.సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఫోన్ చేసిన కోమటిరెడ్డి.

అసభ్య పదజాలంతో దూషించారని తెలుస్తోంది.తనపై విమర్శలు చేయడం మానకపోతే తన అనుచరులు వదలరని బెదిరించారని సమాచారం.

ప్రస్తుతం కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు