శ్రీలీలతో కూడా స్టంట్స్ చేయించిన అనిల్.. ఆ ఫైట్ సన్నివేశాల కోసం ఫ్యాన్స్ ఎగ్జైట్!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకే ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 Another Big Surprise From Balayya Bhagwant Kesari, Balakrishna, Anil Ravipudi,-TeluguStop.com

బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్ కూడా రిలీజ్ చేయడంతో మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.ఈ టీజర్ అండ్ టైటిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల( Sreeleela ) కనిపిస్తున్న విషయం విదితమే.

మరి ఈ భామతో అనిల్ రావిపూడి అదిరిపోయే స్టంట్స్ చేయించాడు అని టాక్.ఈ భామ కొన్ని రిస్కీ స్టంట్స్ చేసింది అని టాక్.అయితే బాలయ్య లాంటి హీరో మూవీలో శ్రీలీల ఫైట్స్ చేసింది అంటే అది నవ్వులు పూయించేలా ఉంటుందా లేదంటే నిజంగానే సీరియస్ ఫైట్ సీన్ నా అనే సందేహాలు కూడా ప్రేక్షకుల నుండి వ్యక్తం అవుతున్నాయి.

మరి ఈ ఫైట్ సీన్ ఎలా ఉంటుందో.ఏ సందర్భంలో వస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal )హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని అనిల్ భావిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube