ఫైబర్ నెట్ స్కాంలో మరికొందరి అరెస్ట్..? నిందితుల్లో మాజీ ప్రజాప్రతినిధులు..?

ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో సిఐడి దూకుడు పెంచింది.ఇస్కాన్ లో మరికొందరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 Another Arrested In Fiber Net Scam? Among The Accused Are Former Mps, Fiber Net-TeluguStop.com

ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల్లో కొందరికి సిఐడి అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.నోటీసులు అందుకున్న వారిలో వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఐ ఆర్ టీ సి అధికారి కోగంటి సాంబశివరావు ను ఇటీవలే విచారించారు.

అయితే హరి కృష్ణ ప్రసాద్ వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న అధికారులు ఆయనను పంపించారు.అంతేకాక తను సిఐడి విచారణకు సహకరిస్తానని కూడా హరికృష్ణ ప్రసాద్ అప్పట్లో చెప్పారు.

  కాగా ఈ స్కాం లో కోగంటి సాంబశివరావు పాత్ర స్పష్టం కావడంతో ఆయనను ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.అంతేకాకుండా కోగంటి సాంబశివరావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ వేశారు.చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ సంస్థలో అక్రమాలు జరిగాయని ఇందుకు సంబంధించి సిఐడి విచారణ జరిపి రూ.120 కోట్ల రూపాయలు అవకతవకలు పాల్పడినట్లు గుర్తించిందని APNFNL చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.ఈ అక్రమాల్లో భాగస్వాములైన 18 మందిని ప్రాథమిక విచారణలో సీఐడీ గుర్తించింది.వీరుగాక ఇంకా మరికొందరు పాత్ర ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

వీరిలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వివిధ కంపెనీల ద్వారా సరఫరా చేసిన ఐటమ్స్ కు సంబంధించి రూ.8 కోట్ల 20 లక్షల పవర్ మీటర్ల ద్వారా ఓటు మీటర్లకు ఎవరు ఉపయోగించడం ద్వారా ఓటిఆర్ మీటర్లకు ఎవర్ మీటర్లు ఉపయోగించడం ద్వారా రూ.1 కోటి 60 లక్షలు వైర్లుమ సెటప్ బాక్స్ లు తదితర సాంకేతిక పరికరాల సరఫరా లో రూ.62 కోట్ల 6 లక్షలు ముందుగా రూపొందించినట్లు అధికారులు గ్రహించారు.టెరా సాఫ్ట్ సంస్థలో యండీ గా పనిచేస్తున్న హరికృష్ణ ప్రసాద్ తో రాజీనామా చేయించి ఆయనను ఏపీ ఫైబర్ నెట్ డైరెక్ట్ గా నియమించడం వెనుక ఏం జరిగిందన్న అంశం పై అధికారులు ఆరా తీస్తున్నారు.

Telugu Andrapradesh, Ap Fiber Sacam, Ap Poltics, Fiber Net Scam, Mps, Kogantisam

ఈ నియమానికి సూత్రధారి ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.టెండర్లు దక్కించుకున్న టెరా సంస్థ పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి ఆ సమస్యను సస్పెండ్ చేసి సంవత్సరంపాటు బ్లాక్ లిస్టులో పెట్టడం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రెండు నెలకు సస్పెన్షన్ ఎత్తివేసి బ్లాక్ లిస్టు నుంచి ఆ సంస్థ పేరు తొలగించడం టెరా సాప్ట్ సంస్థకు టెండర్లను చేజిక్కించుకునేలా సహకరించడం జరిగిందన్న ఆరోపణలపై ఆరా తీస్తున్నారు.బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలు కింది స్థాయి అధికారి సంతకంలో టెండర్ల ప్రక్రియ జరగడం పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube